Oplus_131072
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) 2005-06 బ్యాచ్ విద్యార్థులు 20 సంవత్సరాల అనంతరం ఘనంగా గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొనగా ఒకరినొకరు సుదీర్ఘ కాలం తరువాత తిరిగి కలుసుకుని తమ బాల్య స్నేహాలను, అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పాఠశాలలో పనిచేసిన ప్రధానాధ్యాపకులు నరసింహారెడ్డి, రాజయ్య, ఉపాధ్యాయులు రాజేశ్వర్ రావు, ఎన్టీఆర్, నవీన్ రెడ్డి, హిమాన్షు కుమార్, స్వర్ణలత, కృష్ణమూర్తి, ఆగయ్య, మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో తమ మధురానుభూతులను పంచుకున్నారు. విద్యార్థులు తమ గురువుల ఆశీర్వాదాలను తీసుకుని, వారికి పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులే సొంతంగా ఏర్పాటు చేసి, ఆటపాటలతో ఆసక్తికరంగా నిర్వహించారు. ఉపాధ్యాయులందరూ తమ పూర్వ విద్యార్థులకు ప్రాముఖ్యత గల సలహాలు, జీవిత పాఠాలు అందించారు. ఈ సమ్మేళనం విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఇది మానవ సంబంధాల విలువను గుర్తు చేసే మధురమైన స్మృతిగా నిలిచిపోయింది అని విద్యార్థులు తెలిపారు .






