
స్వర్ణోదయం ప్రతినిధి గుజరాత్ : గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఎయిర్ ఇండియా విమానం సమీపంలోని మేఘానిలో కూలింది.
బీజే మెడికల్ కాలేజీపై కూలిన AI 171 విమానంతో
20 మందికి పైగా మెడికోలు మృతి చెందారు. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు, విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వాసులు, విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI 171 విమానం
ప్రమాదస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు..
సహాయక చర్యల్లో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయకచర్యలు అందిస్తున్నారు. విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్‌రూపానీ ఉన్నారు. ఈ ప్రమాదంతో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మూసి వేశారు. ఎయిరిండియా హెల్ప్‌లైన్ నెంబర్ 1800 5691 444 అందుబాటులో ఉంచారు. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ విమానం కోరడంతో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

విమాన ప్రమాద ఘటన దృశ్యాలు….

ప్రమాదం జరిగిన విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్‌రూపానీ..





