
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బాలల అక్రమ రవాణాను అరికట్టడం, బాల కార్మిక నిర్మూలనను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి నిర్వహించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్ పర్సన్ ధనలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు హుజురాబాద్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని హుజురాబాద్ సెక్టార్ బోర్నపల్లి గ్రామంలో అంగన్వాడీ ఒకటి, రెండవ సెంటర్లో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్ పర్సన్ ధనలక్ష్మి హాజరై శుక్రవారం సభ విశిష్టత గురించి, బాల కార్మికుల నిరోధిక చట్టాల గురించి తెలియజేశారు. స్థానిక సిడిపిఓ ఏం సుగుణ గర్భిణీలు, బాలింతలు రక్తహీనత లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ముర్రుపాలు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం గురించి తెలియజేస్తూ, ఏఎన్ఎం ఆశలు గర్భిణీలు, బాలింతలు, పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని వివరించారు. లోపోషణ ఉన్న పిల్లల్ని PHC కీ మరియు NRC వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని, అదేవిధంగా అంగన్వాడి స్కూళ్లలో ప్రవేశాల కోసం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని జరిపి, అంగన్వాడి లో నూతన సిలబస్ ప్రకారం చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ ఇరుసమ్ నాగరాజు మాట్లాడుతూ ముర్రుపాలు, తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. జిల్లా పరిరక్షణ బాలల కేంద్రం అధికారి పర్వీన్ మాట్లాడుతూ పిల్లల రక్షణ మరియు బాల కార్మికుల నిరోధకం గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళ సాధికారత కేంద్రం నుంచి రోహిణి హాజరై మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్లాలని మరియు ఆర్థిక సాధికారత సాధించాలని చెప్పారు. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పనిచేసే ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంత, సోషల్ వర్కర్ రమేష్, సిడబ్ల్యూసి శేఖర్, మహేష్, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, ఆయాలు ఆశాలు, మహిళా గ్రూపు కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.








