
– ఇందిరమ్మ ఇళ్లను పర్యవేక్షించిన ప్రణవ్.
_ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రణవ్..
ధర్మరాజ్ పల్లి గ్రామంలో లబ్ధిదారుల సంతోషం, భావోద్వేగం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పదేళ్ల తర్వాత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం నాడు హుజురాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో 27 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 20 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. తదుపరి పైలెట్ ప్రాజెక్టుగా ధర్మరాజ్ పల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్లను పరిశీలిస్తున్న క్రమంలో లబ్ధిదారులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్లుగా గుడిసేలో నివసిస్తూ వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చి ఆదుకుందని అన్నారు. గతంలో పెద్దపాపయ్యపల్లి గ్రామంలో గుండేటి సరిత అనే మహిళ ఇళ్లు అకాల వర్షానికి కూలగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని మాట ఇవ్వగా ఇచ్చిన మాట ప్రకారం పట్టాను అందజేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామానికి 98 ఇళ్లు మంజూరు చేసి రెండవ విడత డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. పదేళ్లుగా ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వని టిఆర్ఎస్ వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రవేశపెట్టే ఏ పథకం అయినా ప్రజలకు చేరువలో తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల నాయకులు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.





లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్న ప్రణవ్ బాబు



కొబ్బరికాయ కొట్టి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్

ప్రణవ్ బాబుతో లబ్ధిదారులు..