
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు బాలగోని రాములు (55) ఇటీవల తాడిచెట్టు పైనుంచి కిందపడి తీవ్ర గాయాలకు గురికాగా దావకానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గత మే 24న రాములు గీత వృత్తిలో భాగంగా తాడిచెట్టు పైకి ఎక్కి కళ్ళు గీస్తుండగా మోకుజారి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలైన రాములును 108 ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంలో వరంగల్ ఎంజిఎంకు తరలించారు. అక్కడినుండి మళ్లీ మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. రెక్క ఆడితే డొక్కా ఆడని గీత కార్మికుడు అయినా రాములు గౌడ్ మృతితో అతని కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని, భార్య, కూతుళ్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

బాలగోని రాములు గౌడ్ (ఫైల్)





