
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇటీవల హుజురాబాద్ మండలం కందుగుల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి(45) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడని హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ తెలిపారు. ఈనెల 20న రాత్రి సాయిరాం రైస్ మిల్లు దగ్గరలో రోడ్డుపై మోటార్ సైకిల్ ( AP 13 S 7055) తో రోడ్డుపై గాయాలతో పడి ఉన్నాడు. పరిసర ప్రాంతాల్లో ఉండే కార్మికులు చూసి 108 లో చికిత్స నిమిత్తం హుజురాబాద్ కు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజిఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కాగా మృతుని వివరాలు తెలియదని, ఎవరికైనా తెలిసిన హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని సీఐ కోరారు.

చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి..