
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సుల్తానాబాద్), జూన్ 28: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ అవినీతిశాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బాధితుని ఫిర్యాదుపై శుక్రవారం ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో.. పని పూర్తి చేయడానికి రూ.5,000 లంచం తీసుకుంటున్న ఆసిస్టెంట్ ఇంజినీర్ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఏసీబీ అధికారులకు పట్టుబడిన సుల్తానాబాద్ మున్సిపల్ ఉద్యోగులు ఆసిస్టెంట్ ఇంజినీర్ వినోద్, బిల్ కలెక్టర్ విజయ్..





