Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: బహుభాషా కోవిదుడు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ పీవీనర్సింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రామారావు పాల్గొని పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సరలీకరణను
ప్రవేశ పెట్టడంలో, విదేశాంగ విధానాన్ని బలోపితం చేయడంతోపాటు, విద్యా వ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశ పెట్టారని నవోదయ విద్యాలయాలు ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పదంతో గురుకుల విద్యకు తొలి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. ప్రధానిగా అన్ని రంగాలలో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుందని, నాడు ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు దోహద పడుతున్నాయని రామారావు తెలిపారు.






