Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఐఎన్డీ అలయన్స్ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్” కార్యక్రమంలో భాగంగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, హుజురాబాద్ మండలంతో పాటు పట్టణ, నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్కు చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు “జై కాంగ్రెస్… జై జై కాంగ్రెస్” అనే నినాదాలతో కార్యక్రమ ప్రాంగణాన్ని ఉద్వేగభరితంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి అంశాలపై నేతలు ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధానానికి ఈ కార్యక్రమం ఒక కొత్త దిశగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

———————+++++++——————-
&పత్రికా ప్రకటనలు(యాడ్స్)@
——————–+++++++——————–






