
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అధికారులు ప్రజలు కార్మికులు సమన్వయంతో కార్యక్రమాలు చేస్తుండడం అభినంద నీయమని అందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛ హుజురాబాద్ సాధ్యమని సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 12వ, 13వ వార్డులోని కరీంనగర్ ప్రధాన రహదారి వెంట ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంను ఆయన పరిశీలించారు. హుజురాబాద్ నుండి కరీంనగర్ ప్రధాన రహదారి వెంట ఉన్న మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులను, రోడ్లకు ఇరువైపులా పెరిగిన గడ్డి మొక్కలను, చెత్తా చెదారమును జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని పిల్లలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల సమాజానికి జరిగే దుష్పరిణామాలను వివరించి వాటిని ఎదుర్కోవడానికి పిల్లలు తమ వంతు ఏం చేయాలో కమిషనర్ సమ్మయ్య వారికి వివరించారు.
– పొడి చెత్త సేకరణ కేంద్రం పరిశీలన
హుజురాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో మొదటి మూడవ శుక్రవారం లలో నిర్వహిస్తున్న పొడి చేత్త సేకరణ కేంద్రాన్ని జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. కాగా శుక్రవారం 70 కిలోల పొడి చెత్త సేకరణ జరగడం పట్ల ఆయన సిబ్బందిని అభినందించారు. 23వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో కలిసి మోఖా పై ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండుటకు గాను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చే వ్యాధుల గురించి జాగ్రత్తల గురించి వివరించారు. కొత్తపల్లిలోని అంగన్ వాడీ కేంద్రమును సందర్శించి, కేంద్రము లోని చిన్నారులతో కిచెన్ గార్డెన్ఏర్పాటు చేయించారు. ఇప్పల్ నర్సింగాపూర్ లోని మహిళలు నాటిన 200 మొక్కలను పరిశీలించి, వాటి సంరక్షణ చేయుచున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు నిర్వహించే ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మున్సిపల్ అభివృద్ధి కోసం జరుగుతున్న పనులను, 100 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని గురించి అడిగి తెలుసుకుని కార్యక్రమాలు సక్రమంగా జరగడం పట్ల బాధ్యతగా చేస్తున్న కమిషనర్ ను, సిబ్బందిని జాయింట్ డైరెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిన్టెన్ డెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, బస్తీ దవఖాన డాక్టర్ జరీనా, మేనేజర్ భూపాల్ రెడ్డి, జె శ్రీకాంత్, రషీద్, రోన్టాల సుధీర్, ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్ కు స్వాగతం పలుకుతున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ ఉద్యోగులు..


మొక్కలు నాటి నీళ్ళు పోస్తున్న సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్..




అంగన్వాడి సెంటర్ ను సందర్శించి పరిశీలిస్తున్న సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్..


బుడగజంగాల కాలనీ సందర్శించి, పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్..


ఏరియా ఆసుపత్రిని సందర్శించి సిబ్బందికి వైద్య పరీక్షల వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్…


మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను అభినందించి మాట్లాడుతున్న సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్..

మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాస్..





