
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని క్షయ వ్యాధిగ్రస్తులు దీనిని తప్పక పాటించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు లు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ పోషణ్ యోజన కార్యక్రమం కింద కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆరు నెలల పాటు క్షయ వ్యాధిగ్రస్తులు పూర్తిగా వైద్యులు సూచించిన మందులు వాడాలని, మద్యం ధూమపానం నకు దూరంగా ఉండాలన్నారు. మందులు వాడుతున్న సమయంలో ఆరు నెలలకు 6000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో చెల్పూర్ పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మధుకర్, బస్తీ దవఖాన వైద్యాధికారి డాక్టర్ జరీనా, సిహెచ్ ఓ శ్యామ్, హెచ్ ఈఓ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏరియా ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ పోషణ్ యోజన కార్యక్రమం కింద కిట్స్ పంపిణీ చేస్తున్న జిల్లా అధికారి..
———————++++++———————-
#పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
——————–++++++———————
