
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజూరాబాద్, జూలై 07: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం ద్వారా విద్యాభ్యాసంలో ఉత్తేజాన్ని పెంచి, వారికి అవసరమైన వనరులు అందించడం ఎంతో సహాయపడుతుందని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద అన్నారు. సోమవారం హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం హోంగార్డు అనిల్ తన తల్లి స్మారకార్థం ఆహార ప్లేట్లు, నీటి సీసాలను అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావం పెంపొందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు మానవత్వంతో ముందుకు రావాలని ఆమె పిలుపు నిచ్చారు. ప్లేట్లు, నీటి సీసాలు అందజేసిన అనిల్‌ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయురాలు శారదను సత్కరిస్తున్న గ్రామస్తులు..


విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిలను పంపిణీ చేస్తున్న దాత..
———–+++++++++———————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
——————-+++++++—————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






