Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జన్మదిన కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. వైయస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలను గుర్తుచేసుకొని అయినా తీసుకువచ్చిన పథకాలు కలకాలం గుర్తుండిపోతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

———————-++++++++——————
@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@
———————+++++++++————–
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






