
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ వాసు, ఫహద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ వుటుకూరి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ ఫహద్, గుర్రం వాసుల ఆద్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బారి ఫ్లెక్సీనీ క్రేన్ సహాయంతో ఏర్పాటు చేసి గజమాలతో సత్కరించి టపాకాయలు కాల్చుతూ వందలాది మంది యువత నడుమ బారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిసి ఫహద్, వాసులు కేక్ కట్ చేస్తూ యువత ని ఎంతో ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఫహద్, వాసులు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శ ప్రాయమన్నారు. ఒక ట్యూషన్ మాస్టర్ గా ప్రారంభమైన వారి జీవితం నేడు వేలాది కుటుంబ బ్రతుకు దెరువుగా మారిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే విద్యా రంగంలో కరీంనగర్ ని గర్వ పడేలా చేసిన గొప్ప వ్యక్తి నరేందర్ రెడ్డి అని అన్నారు. విద్యతో పాటు దైవం, సామాజిక కార్యక్రమాల్లో వారి ప్రోత్సాహకం అభినందనీయమన్నారు. రాజకీయంగా తప్పకుండా వారు రాష్ట్ర స్థాయిలో ప్రజలకి సేవ చేసే గొప్ప అవకాశం భగవంతుడి దీవెనతో, కరీంనగర్ ప్రజల సహకారంతో వచ్చి తీరుతుందన్నారు. అవిశ్రాంత సేవకుడు, సేవా గుణం, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన నరేందర్ రెడ్డి అని అన్నారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో sc సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్, St సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి శ్రీకాంత్, బత్తిని విష్ణు, కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఓరుగంటి కిషోర్, జక్కుల అఖిలేష్, మానకొండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్, ఎల్కపల్లి సిద్ధార్థ్, కరీంనగర్ మండల అధ్యక్షులు గట్టు ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ బుర్ర రాహుల్, ముక్కెర సతీష్, ముజఫర్, ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకులు గొట్టే బాబు ప్రణవ్, నాయకులు మాడుగుల ప్రవీణ్, మహిళా నాయకురాళ్ళు రజిత తదితరులు పాల్గొన్నారు.

బారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..
———————-+++++++——————
#పత్రికా ప్రకటనలు (యాడ్స్)#
—————+++++++++———————–
&వార్షికోత్సవ శుభాకాంక్షలు&
