
– దళిత బంధు నిధులను విడుదల చేయకుండా దళితులను రాజకీయంగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ
– హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శనివారం రోజున హుజురాబాద్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏఓ భాస్కర్ కి దళిత బంధు రెండో విడత మంజూరు చేయాలని ఆర్డీవో ఆఫీస్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు మాట్లాడుతూ దళిత బంధు నిధులని మంజూరు చేయకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని విమర్శించారు. కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలవడం కొరకు దళిత బంధు డ్రామా ఆడుతుందని, దళిత బంధు మంజూరు కాకుండా కౌశిక్ రెడ్డి చేసినటువంటి తప్పిదాన్నే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంధన్నారు. రెండో విడత దళిత బంధు నిధులు విడుదలయ్యే సమయానికి ఆలస్యమై 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా నిలిచిపోయినదన్నారు. దళిత బంధును గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని దళితుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. దళిత బంధు నిధులని మంజూరు చేయకుండా అడ్డుపడితే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెండో విడత దళిత బందు నిదులను మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు నల్ల సుమన్, యంసాని శశిధర్, తిప్పబత్తిని రాజు, అంకటి వాసు, సబ్బని రమేష్, పడారి కొమరయ్య, బోరగాల సారయ్య, గంట సంపత్, ఒడ్నాల చంద్రిక, కొలిపాక వెంకటేష్, బూత్ అధ్యక్షులు క్యాష వెంకటేస్, రాజేష్ ఖన్నా, అయిత సందీప్, గరిగ శివకృష్ణ, చెత్తర్ సింగ్, తాళ్లపెళ్లి దేవేంద్ర, కొడిమ్యాల పవన్ కుమార్, రాపాక రాజు, ఆవుల సదయ్య, భాస్కర్ యాదవ్, గుడపాటి కొండారెడ్డి, నీలం రవీందర్, గంధం సంతోష్, తూర్పాటి సునీల్, నాయకులు, కార్యకర్తలు, దళిత బంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు..

ఆర్డిఓ ఆఫీస్ లో ఏఓ భాస్కర్ కి దళిత బంధు రెండో విడత మంజూరు చేయాలని వినతి పత్రం ఇస్తున్న బిజెపి నాయకులు..

ఆర్డిఓ ఆఫీస్ ఏఓ భాస్కర్ కి దళిత బంధు రెండో విడత మంజూరు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజు
——————–++++++++++—————–
&పత్రికా ప్రకటన (యాడ్స్)&
——————-+++++++++—————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు #






