
– వైఎస్ మరణం తీరని లోటు
– వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
– వృద్ధులకు పండ్లు పంపిణీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మహానేతను తెలుగు ప్రజలు కోల్పోవడం దురదృష్టకరమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేవని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందారని, రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగ రంగాల్లో స్థిరపడ్డారని, ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దపెద్ద ఆపరేషన్లను సైతం ఉచితంగా చేయించుకొని ప్రజలు ప్రాణాలను కాపాడుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజా పాలనను ఆదరిస్తున్నారని, రాబోయే 2028 ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎగరబోయేది కాంగ్రెస్ పార్టీ జెండా నేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందమల్ల నరేష్, కొత్తగట్టు చక్రపాణి, సందమల్ల బాబు, దుబాసి బాబు, రాఘవేంద్ర, కెఆర్ బిక్షపతి, గదె శ్రీకాంత్, బావు తిరుపతి, జంగ అనిల్, ఓదేలు, ముక్క రమేష్, ఎర్ర అనిల్, తాడెం నాగరాజు, ముక్క రవితేజ, అన్వేష్, గద్దల కార్తికేయ, వరుణ్, రాజు పాల్గొన్నారు.

వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు..




పండ్లు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..
—————++++++++——————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
——————++++++++——————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






