
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవాస్తవ, నీచ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తున్నాననీ బీఆర్ఎస్ యూత్ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకుడు మోరే మధు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ జర్నలిస్ట్ చేసిన పని కోసం ఎమ్మెల్యేని లింక్ చేయడం ఎంతవరకు న్యాయం? రేపు మీ రేవంత్ రెడ్డి ఫోటోను ఎవరైనా అనుచితంగా ఎడిట్ చేస్తే, అది రేవంత్ రెడ్డి చేసిన పనిగా తేలుస్తారా? అని అన్నారు.
ఇది కచ్చితంగా జాతిని, మాల కుల గౌరవాన్ని తక్కువ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం చేసిన తప్పుడు ఐడియా ప్రచారం అని మధు ఆరోపించారు. అసలు మాల కన్నమ్మ దాసు సంఘ భవన నిర్మాణానికి 15 గుంటల స్థలాన్ని మంజూరు చేసింది ఎవరు? అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా! భూమి పూజ చేసిన నేత ఎవరు? అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారే కదా! అని మధు గుర్తు చేశారు.
అప్పుడు చుట్టూ తిరిగిన మీరు, ఇప్పుడు అధికారానికి అమ్ముడైనవాళ్లలా మాట్లాడటం సిగ్గుచేటు అని, మాల సమాజం మీద ప్రేమ చూపించేవాళ్లం మేము అని, ఏప్పటికైనా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాంటెంట్ ఎడిట్ చేసి వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం మాల కాంగ్రెస్ నాయకులకు తగదు అని, ఇకనైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి అన్నారు. లేకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారనీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరువుకు భంగం కలిగించే యత్నాలు చేస్తే ఊరుకోమని మోరె మధు హెచ్చరించారు.

బీఆర్ఎస్ యూత్ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకుడు మోరే మధు..
———————+++++++++——————-
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
—————–++++++++++—————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






