
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:మాతృ భూమికి సేవ చేయడం విద్యార్థులు బాధ్యతగా తీసుకోవాలనీ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ సూచించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ నగరంలో మహా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న అన్ని కళాశాలల , పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ హాజరై మాట్లాడుతూ 1949 జులై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థిని విద్యార్థులతో ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడిందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తు విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వేంటనే పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుందన్నారు. అలాగే ఈ దేశం కోసం స్వాతంత్ర్యం రాకముందు ఎంతో మంది చనిపోతే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశం కోసం 44మంది కార్యకర్తలు జాతీయ జెండా కోసం తుపాకీ గుండుకు గుండేను అడ్డుపెట్టి జాతీయ వాదం కోసం RSU గుండాలకు వ్యతిరేకంగా పోరాడి భరతమాత కాళ్ళ దగ్గర పుష్పాంజలి లాగా వాళ్ళ తలలను సమర్పించారని అన్నారు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మాత్రమే ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడరని అలాగే ఇందిర గాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఉద్యమం చేసిందన్నారు.
అస్సాం రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటు దారుల వస్తే “SAVE ASSAM TODAY – SAVE INDIA TOMORROW” నినాదంతో అస్సాంకి చొరబాటు దారులు రాకుండా ఉద్యమం చేసింది విద్యార్థి పరిషత్ మాత్రమే అని గుర్తు చేశారు. అలాగే కేరళ రాష్ట్రంలో జాతీయ వాదుల మీద దాడి జరిగితే చలో కేరళ పేరుతో లక్షమంది పైగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కేరళ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ర్యాలీ తీసి కేరళలో వున్న జాతీయ వాదులకు మేము అండగా వున్నాం అని చాటి చెప్పడం జరిగిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంలో ఎన్నో ఏళ్లుగా ఎబివిపి ఉద్యమం ఫలితంగా రద్దయ్యిందనీ, నేడు అక్కడ వున్న ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారని గుర్తు చేశారు. విద్యా జాతీయకరణ కావాలని ఆనాడు గోడ మీద రాసిన రాతలు నేడు పార్లమెంట్ లో చట్టమై అమలులోకి వచ్చి నూతన జాతీయ విద్యా విధానం ప్రారంభం అయ్యిందన్నారు. నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు. నా రక్తం నా తెలంగాణ పేరుతో ఒకేరోజు ఇరవై వేల మంది విద్యార్థులతో రక్తదానం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రణభేరి కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ, ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు చనిపోతుంటే ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని బ్రతికి వుండి ఆకుపచ్చని తెలంగాణ, హరిత తెలంగాణ చూడాలని, నా తెలంగాణకు హరితహారం పేరుతో ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడం జరిగిందన్నారు. అంతేకాదు ప్రతినిత్యం విద్యార్థులలో వుంటు ఎటువంటి సమస్య వచ్చినా విద్యార్థి పరిషత్ పరిష్కారిస్తుందని అలాంటి విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతృ భూమికి సేవ చేయడం విద్యార్థులుగా మన అందరి కర్తవ్యం అని, విద్యార్థి పరిషత్ ఉద్యమాలలో అందరూ భాగస్వాములు కావాలని అజయ్ పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం పనిచేసే విద్యార్థి పరిషత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి వరికోలు రాజు, పెరుగు అభిలాష్, నగర ఉపాధ్యక్షులు ఎనగంటి కిరణ్, బొరుగాల గౌతమ్ , బురగాల సిద్ధార్థ, నగర సోషల్ మీడియా దాట్ల అక్షయ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.





వందలాది మంది విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులు..
——————-++++++++++++—————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
——————–+++++++++——————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






