
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై09: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం హుజురాబాద్ డివిజన్లో కార్మిక కర్షకుల పెన్షనర్ల ఒక రోజు సమ్మె విజయవంతం అయింది. అందులో భాగంగా హుజురాబాద్ కేడీసీసీ బ్యాంకు ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టగా, ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఉద్యోగులు, విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ శాఖ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సార్వత్రిక సమ్మె. దీనికి
ముఖ్యఅతిథిగా టాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు అసోసియేషన్ ఫెడరేషన్స్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక పెన్షనర్స్ కు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ కొప్పుల శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కదిరే రమేష్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మున్సిపల్ పార్కులో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తడికమళ్ళ శేఖర్ లు మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్ హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేస్తూ, కార్మికులకు 26 వేల కనీస వేతనాన్ని చెల్లించాలని, అదేవిధంగా ఈపీఎస్ పెన్షనర్స్ కు రూ.13,000 కనీసంగా పెన్షన్ చెల్లించాలని, ఎన్ పి ఎస్, సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించి, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని కోరుతూ, వెల్ఫేర్ ఫండ్లో కి వచ్చిన చందా నిధులతో నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ కవరేజ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండీ అజ్జు, తాడూరి లతా, బజార్, హమాలి నాయకులు చంద్రయ్య, ఎడ్ల శ్రావణ్ కుమార్, కొండూరు కిరణ్, టా ప్రా నాయకులు బొంగోని వెంకటయ్య, చీకట్ల సమ్మయ్య, తాటిపాముల కనుకయ్య, భారత ప్రభాకర్, దొంత హరికిషన్ ముక్కెర మొగిలి, గాజర్ల బుచ్చిరాజం తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా హుజురాబాద్ బ్రాంచ్ లో LIC ఉద్యోగులు అల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు పాల్గొన్నారు, ఈ సందర్బంగా హుజురాబాద్ ICEU ప్రెసిడెంట్ బొంకూరి కుమారస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తుందని, కార్మిక హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు రూపందిస్తుందన్నారు. LIC లో క్లాస్ 3 రిక్రూట్మెంట్ చేపట్టాలని, ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానలు విరామించుకోవాలని, లాభలా బాటలో నడుస్తున్న పబ్లిక్ రంగాలను ప్రయివేట్ పరం చేయడం సరికాదన్నారు. విద్యుత్ ప్రయివేయికారణ ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగిలకు కనీస వేతనం 26000=00 ఇవ్వాలని అన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో 100శాతం పెట్టుబడులు ఉపసంహారించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఆకుల చందర్, జనరల్ కౌన్సిల్ మెంబర్ పి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరిలు జీ ఋషిత్, టీ అంజలి, కోశాధికారి ఆర్ కుమారస్వామి, మరియు సిబ్బంది వై గోపికిశోర్, ఎన్ ప్రశాంత్, ఏంవీ శ్రీనివాస్, ఏం ప్రేమకుమార్, ఏం వివేక్, జీ రమేష్, ఏం శ్రీనివాస్, ఆశీష్, అనిలా, గోరెమియా తదితరులు పాల్గొన్నారు.


మున్సిపల్ ఉద్యోగులు కార్మికులను, సిఐటియు ను ఉద్దేశించి మాట్లాడుతున్న టా ప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్..


ఎల్ఐసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. సంఘం నాయకులు..

ట్రాన్స్ కో డిఈ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..
———————-++++++++—————-
@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@
——————+++++++++——————
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






