Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకునిగా పని చేస్తున్న వడ్డేపల్లి సాయిచరణ్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. చరిత్ర పట్ల ఉన్న మక్కువతో కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ తాళ్లపెల్లి మనోహర్ మార్గదర్శకత్వంలో ‘‘1853 నుండి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు’’ అనే అంశంపై నాలుగేళ్ల పాటు పరిశోధన చేశారు. తన పరిశోధన ఫలితాలను విశ్వవిద్యాలయానికి సమర్పించగా, విశ్వవిద్యాలయ అధికారులు పరిశీలించి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. ఇటీవల విశ్వవిద్యాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సాన్నిధ్యంలో జరిగిన స్నాతకోత్సవంలో డాక్టర్ సాయిచరణ్‌కు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గురువారం కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని డాక్టర్ సాయిచరణ్‌ను ఘనంగా అభినందించారు.


వడ్డేపల్లి సాయిచరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందజేస్తున్న అతిథులు..


గౌరవ డాక్టరేట్ వడ్డేపల్లి సాయిచరణ్‌కు శాలువా కప్పి సత్కరిస్తున్న జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు..





