
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కటిక సేవా సంఘం ఆధ్వర్యంలో కటిక కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ ధర్మ వ్యాధుడు ఉత్సవాలను గురువారం పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కటిక సేవా సంఘం నాయకులు శ్రీ ధర్మ వ్యాధుడి చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. కటిక కులస్తుల ఆరాధ్య దైవంగా శ్రీధర్మవ్యాధుడి పూజలందుకుంటున్నారని, ఆయన జయంతిని పురస్కరించుకొని ఒకరోజు కులవృత్తిని బందు చేసి ఆయన స్మరణలో గడపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కటిక సేవా సంఘం గౌరవాధ్యక్షుడు కోయల్ కార్ రమేష్, అధ్యక్షుడు మిరియాల్ కార్ చందాజీ, ఉపాధ్యక్షుడు కోయల్ కార్ దుర్గాజీ, ప్రధాన కార్యదర్శి కోయల్ కార్ బాలాజీ, సంయుక్త కార్యదర్శి రావుల్ కార్ యాదగిరి, కోయల్ కార్ శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి కోయల్ కార్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులు జమాల్ పూర్ అనిల్, కోయల్ కార్ సాయిరాం, గౌలికార్ అనిల్ తదితరులతో పాటు కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న కటిక సేవా సంఘం నాయకులు..


పెద్ద ఎత్తున పాల్గొన్న కులస్తులు





