
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హైదరాబాదులో బిసి ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే బీసీల మహా ధర్నాకు మంగళవారం హుజూరాబాద్ పట్టణం నుండి బీసీ నాయకులు వివిధ వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ….ప్రభుత్వం బీసీలను మభ్య పెట్టడానికి 42 శాతం రిజర్వేషన్ల పై ఆర్డినెన్స్ విడుదల చేస్తానని చెబుతుందని అన్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగ బద్ధంగా బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ముందుకు పోతేనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయని ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు అది చేస్తాo, ఇది చేస్తాం.. అంటూ మభ్య పెడతారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే 42 శాతం ఆర్డినెన్స్ తీసుకొని వస్తానని చెబుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీలపై ప్రేమ ఉంటే కోర్టుల ముందు నిలిచే విధంగా చట్టాలను చేయాలని, రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతారని అన్నారు. బీసీలను మభ్య పెట్టాలని ప్రభుత్వం చూస్తుంటే బీసీలు చూస్తూ ఊరుకోరని ఉద్యమాలకు దిగుతారని వారు హెచ్చరించారు. కేవలం ఎన్నికల కోసం ఆర్డినెన్స్ తేరాదని అన్నారు. ధర్నాకు తరలి వెళ్లిన వారిలో మాజీ కౌన్సిలర్లూ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మక్కపల్లి కుమారస్వామి, పంజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు




హైదరాబాదులో బీసీల మహా ధర్నాకు తరలి వెళ్లిన హుజురాబాద్ కు చెందిన బిసి నాయకులు…