
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. వినోద్ కుమార్ ఉమ్మడి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రమాదేవి, సుశీల, శ్రీనివాస్ గౌడ్, తోగరు సదానందం, ఉమామహేశ్వర్, కుమారస్వామి, నాయకులు చందా గాంధీ, అంజదుల్లా ఖాన్, పూర్ణచందర్, కిరణ్ గౌడ్, ఇమ్రాన్, నరేష్, అనిల్ యాదవ్, పీ కృష్ణ, శ్రీధర్ గౌడ్, తులసి లక్ష్మణమూర్తి, కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కోలిపాక శ్రీనివాస్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు..





