
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ రోజు(మంగళవారం) హైస్కూల్ గ్రౌండ్ లో వర్షపు నీరు నిలిచి ఉండటం వల్ల వాకర్స్ కు ఇబ్బందిగా మారడంతో హుజురాబాద్ మున్సిపల్ కమిషనరు కే సమ్మయ్య మరియు మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ కి, పెద్దలు బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ లకు తెలపడంతో వెంటనే వారు స్పందించి వర్షపునీరు లేకుండా బల్దియా సిబ్బందితో వర్షం నీరు తొలగించడం జరిగింది. హై స్కూల్ క్రీడా మైదానంలో వర్షం నీరు తొలగించేందుకు కృషిచేసిన బల్దియా కమిషనర్ సిబ్బందికి వాకర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే హరిప్రసాద్, సెక్రటరీ ఎండి మతిన్ తెలిపారు. హుజురాబాద్ మున్సిపల్ కమీషనర్ కి వాకర్స్ కమిటీ మరియు గౌరవ సభ్యుల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అలాగే ఇందుకు సహకరించిన పాక సతీష్, కొత్తూరి రమేష్, ఆకుల సదానంద, బోనగిరి తిరుపతి, బండ కిషన్, కొలిపాక మహేష్, కుడికాల ప్రభాకర్, వేల్పుల ప్రభాకర్, బుర్ర కుమార్ మరియు గౌరవ సబ్యులకు మున్సిపల్ సిబ్బందికి హుజురాబాద్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున ధన్యవాదాలు చెప్పారు.


క్రీడా మైదానంలో నిలిచిన వర్షపు నీరును తొలగిస్తున్న బల్దియ సిబ్బంది..

దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, సభ్యులు..





