
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బుడగ జంగాల కాలనీలో
చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది ప్రజలకు బీపీ షుగర్, టిబి, హెచ్ఐవి, హెపటైటిస్ బి వంటి పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించారు. ఎయిడ్స్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించి పలువురికి కౌన్సిలింగ్ జరిపారు. పరీక్షలు జరుపుకున్న పలువురికి ఉచితంగా మందులను అందించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుకర్, డాక్టర్ శశాంక్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విజయేందర్ రెడ్డి, సత్యం ఎన్ఎంలు, ఆశలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు,

వైద్య శిబిరంలో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య..


వ్యాధులపై కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్న వైద్యులు, సిబ్బంది..

ఆస్పత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది…





