Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో హుజురాబాద్ లోనీ అన్ని మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధికారులను కోరారు. ఏప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకోవాలని, వర్షాకాలం వలన విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున, ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం రోజున 5 మండలాల ఎంపీడీవోలు, 2 పట్టణాల కమిషనర్ లతో ఆయన మాట్లాడి తగిన సూచనలు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేయాలన్నారు. రైతులు వ్యవసాయానికి వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ సూచించారు.






