
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నిరుపేదలు గతంలో తమ సొంత స్థలంలో బేస్మెంట్ నిర్మాణం చేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకాశం కల్పించాలని నిబంధనలు సడలించాలనీ కోరుతూ శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, ఎండి కాలిద్ హుస్సేన్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో ఇంటి నిర్మాణం కోసం అప్పులు తీసుకుని వచ్చి బేస్మెంట్ వరకు కట్టుకున్నారని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం లేదని అన్నారు. దీని వల్ల ఎంతోమంది నిరుపేదలు లబ్ధి పొందలేక పోతున్నారని అటువంటి వారికి సడలింపు ఇవ్వడం ద్వారా అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం ఎండి కాలిద్ హుస్సేన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేస్తున్న వేల్పుల రత్నం, ఎండి కాలిద్ హుస్సేన్…





