
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 02: హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన బండమీది కుమారస్వామి రోజు వారి కూలిగా సుతారి పనిచేసుకునేవాడు. గత మూడు నెలల క్రితం పని చేస్తుండగానే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు వెంటనే అతనిని హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చూసి బ్రెయిన్ లో రక్తం బ్లీడింగ్ అవుతుందనీ వెంటనే హైదరాబాద్ కి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుండి హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ దాదాపు పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది, ఇంకా ఇతను పూర్తిగా కోలుకోలేదు. ఈ విషయం తెలిసి అతని దీనస్థితికి చలించిన పెద్ద పాపయ్యపల్లి పదవ తరగతి పూర్వ విద్యార్థులు 2001బ్యాచ్ మిత్రులు బండామీది కుమారస్వామికి రూ. 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి చేయూతనందించారు.







