
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన పంజాల కృష్ణ అనే యువకుడు ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం ప్రకారం… కృష్ణ హుజురాబాద్ కు చెందిన వనం హరీష్ అనే వ్యక్తికి 25 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడని, గత 15 నెలలుగా అసలు వడ్డీ ఇవ్వడం లేదని, ఇటీవల డబ్బుల కోసం అడగగా నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకొని హరీష్ అనడంతో తను ఇవ్వాల్సిన వారికి సమాధానం చెప్పుకోలేక మనస్థాపానికి గురై హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆదివారం రాత్రి సెల్ఫీ వీడియో తీసి తన చావుకు హరీష్ కారణమని అతని దగ్గర డబ్బులు వసూలు చేయాలని తన కుటుంబ సభ్యులకు తెలుపుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణ ను వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని జమ్మికుంట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా కృష్ణ భార్య హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన పూర్వపరాలను విచారిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు శివాలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బాధితుడు పంజాల కృష్ణ..

అదే రోజు సాయంత్రం ఆత్మహత్యా చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్న డబ్బుల బాధితుడు కృష్ణ…
—————-+++++++++——————
&పత్రికా ప్రకటనలు&
——————-++++++++—————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






