
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామంలో కనకం కర్ణాకర్ మరియు ఆయన సతీమణి అఖిల యాజమాన్యంలోని భారత్ పెట్రోల్ పంపు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాస్టర్ కనకం సునీల్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు.
బోర్నపల్లి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంకు స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కొత్త పెట్రోల్ బంకు వల్ల బోర్నపల్లి, సైదాపూర్ మండల పరిధిలోని ఎలపోతరం, చింతలపల్లి, రామచంద్రపూర్, రాములపల్లి, ఎల్లంపల్లి, గుడిశాల, బొమ్మకల్, అమ్మనగుర్తి, రాయికల్ తదితర చూట్టుపక్కల గ్రామ ప్రజలకు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదనీ, ఇది ఆ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ పెట్రోల్ బంకును ప్రారంభించడం వల్ల గ్రామానికి మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా ఎంతో మేలు చేస్తుందని అన్నారు. పలువురికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం పట్ల ఫాస్టర్స్ డేవిడ్ రాజకుమార్, ఉదయ్ కుమార్, ఇమ్మానుయేల్, కుమార్, సుకుమార్, సురేందర్ తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


———+++———-++++++———————
&పత్రిక ప్రకటనలు&
——————–+++++++———————-
&వార్షికోత్సవ శుభాకాంక్షలు&






