Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజాయుద్ధ నౌక గద్దర్ రెండవ వర్ధంతిని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, నగరే కళాబృందం ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈనెల 8వ తేదీన హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక సారధి వెన్నెల గద్దర్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారనీ, వెన్నెలతో పాటు ప్రొఫెసర్ కాసిం, మేధావులు, కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని హుజురాబాద్ కు చెందిన ప్రజాసంఘాల నాయకులు ఆవునూరి సమ్మయ్య, ముక్కెర రాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు సారథ్యంలో శనిగరం బాబ్జి అతని బృందంచే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు.

—————–+++++++———————–
&పత్రికా ప్రకటనలు&
—————–++++++++++——————–
@#వార్షికోత్సవ శుభాకాంక్షలు@#






