Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధులు హుజురాబాద్: ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగించి తనకు విద్యపై ఉన్న మక్కువతో కష్టపడి చిన్ననాటి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నిట్లోనూ గొప్ప మార్కులు సాధించాడు. అంతటితో చదువుపై తన ఇష్టాన్ని వదులుకోక జెఈఈ మెయిన్స్ లో 96.09 శాతంతో ఉత్తీర్ణత సాధించి, జెఈఈ లో 4797 ర్యాంక్ సాధించాడు. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ పేద విద్యార్థికి పై చదువు చదవాలంటే పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పుడు ఆ విద్యార్థికి ఎవరైనా అండగా నిలిచి ఆర్థిక సహాయం చేస్తే గొప్పగా చదివి మరికొంతమందికి సహాయం చేస్తానంటున్నాడు. తనను ఆర్థికంగా ఆదుకొని తన విద్యాభ్యాసానికి సహాయపడాలని రెండు చేతులెత్తి మొక్కుతున్నాడు. ఆయన కుటుంబం సైతం తమ కుమారునికి సహాయం అందించే ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నాయి.
హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామానికి చెందిన నీరటి అశోక్ లత దంపతుల కుమారుడు రిషి. తల్లిదండ్రులు కూలీ చేసుకుంటూ తమకుమారున్ని చదివించారు. అశోక్ కి తన కుమారుని చదివించే స్తోమత లేకపోవడంతో చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. చదువుపై ఉన్న ఇష్టంతో రిషి గొప్పగా చదివి పదో తరగతిలో 9.7/10 జిపిఏ పొందాడు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ గ్రూపులో చదివి 941 మార్పులు కూడా సాధించాడు. అనంతరం కష్టపడి చదివి జె ఈ ఈ మెయిన్స్‌లో 96.9 శాతం మార్కులు సాధించి, 4797 ర్యాంక్ సాధించి ఎన్ఐటి వరంగల్ లో సీటు సాధించాడు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వరంగల్ నీటిలో విద్యాభ్యాసం పూర్తి చేయడానికి సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఒక్కో సంవత్సరానికి ₹1,50,000 వరకు ఖర్చు వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తన పై చదువుల కోసం ఎవరైనా సహాయం అందిస్తే తాను ఉన్నతంగా చదువుకొని మరికొంతమందికి ఉపయోగపడతానని అంటున్నాడు. ఎవరైనా మానవతావాది ముందుకు వచ్చి తమ కుమారుడి చదువుకు సహాయం అందిస్తే జీవితాంతం రుణపడి ఉంటామని ఆ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదువుపై ఇష్టంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన నీరటి రిషికి సహాయం అందిస్తే ఒక విద్య కుసుమాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతాం. తనకు నేరుగా సహాయం అందించాలనుకునేవారు తనకు ఫోన్ చేస్తే వారి వద్దకు వెళ్తానని చెబుతున్నాడు. అలాగే ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే
91540 37615 కు సంప్రదించాలని కోరారు. అలాగే బ్యాంకు ద్వారా పంపించాలనుకునే వారు. నీరటి రిషి
అకౌంట్ నెంబర్. 41131965476
ఐఎఫ్ఎస్సి : SBIN0020143
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హుజురాబాద్ కి పంపించాలని వేడుకుంటున్నారు.

————————-++++++++——————–
@పత్రికా ప్రకటనలు@
—————–++++++—————————
&వార్షికోత్సవ శుభాకాంక్షలు &






