
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చలో పెద్దపెల్లి డీజే ఎఫ్ 5వ జాతీయ మహాసభ పోస్టర్ ను హుజూరాబాద్ టౌన్ సిఐ టి.కరుణాకర్ చేతుల మీదుగా చలో పెద్దపెల్లి డీజే ఎఫ్ 5వ జాతీయ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. హుజురాబాద్ డివిజన్ కమిటీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జర్నలిస్ట్ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగళవారం రోజున ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ “పత్రికా స్వేచ్ఛ మరియు నిస్పక్షపాత సమాచార ప్రబోధానికి పాత్రికేయులు చేస్తున్న సేవలు అభినందనీయమైనవి అన్నారు. డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వంటి సంస్థలు జర్నలిస్టుల హక్కులను కాపాడడంలో, సమాజానికి నిబద్ధతతో సేవ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ గౌరవ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, ఉపాధ్యక్షులు మట్టెల సంపత్, ప్రధాన కార్యదర్శి పల్లె సతీష్ గౌడ్, కోశాధికారి మిట్టపల్లి సురేందర్, సహాయ కార్యదర్శి మొలుగు వంశి, ఈసీ మెంబర్ ముశం రమేష్, సంగాల రాజకుమార్, స్థానిక మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఐకి జ్ఞాపిక బహూకరించి సత్కరించారు.

డీజేఎఫ్ జాతీయ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న సిఐ కరుణాకర్, ఆ సంఘం నాయకులు..
—————++++++++————————-
&#పత్రికా ప్రకటనలు&#
—————+++++————————–
@#వార్షికోత్సవ శుభాకాంక్షలు#@






