
– సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు …
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి నీళ్ళు నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చెప్పి ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచారని రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మదీనా కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆనాటి ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకనుకూలంగా ప్రజలను ఉద్యమం దిశగా, రాష్ట్ర సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఎత్తుగడలను అమలు చేసే దిశగా మలి దశ ఉద్యమ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తి మరువలేనిదని అన్నారు
రాష్ట్ర సాధనను ఆశగా, శ్వాసగా చేసుకొని ఆజన్మ బ్రహ్మచారిగా జీవించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు జయశంకర్ సార్ అని మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా నాలుగు కోట్ల ప్రజలలో ఆయన ఉద్యమ చైతన్యాన్ని రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఆ ఫలితాన్ని తన కళ్ళారా చూడకుండానే జీవితాంతం ఉద్యమానికి అంకితమై నిష్కల్మషంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడని తెలంగాణ ప్రజల జాతి పితగా నిలిచారని రామారావుఅభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం నెక్లెస్ రోడ్డు ఎదుట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని నెలకొల్పాలని రామారావు పాలకులకు విజ్ఞప్తి చేశారు. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రామారావు తెలిపారు. ఆచార్య జయశంకర్ సార్ జీవితం నేటి యువతకు ఆదర్శం, ఉద్యమానికి ప్రేరణ అని పోలాడి రామారావు పేర్కొన్నారు.


———————–+++++++++—————–
#&పత్రికా ప్రకటనలు&#
——————+++++++++——————-
#@వార్షికోత్సవ శుభాకాంక్షలు@#







