Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజాయుద్ధనౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారది చైర్ పర్సన్ డా: వెన్నెల గద్దర్ ఆదేశాల మేరకు వడ్లకొండ అనిల్ కుమార్ కళాబృందంచే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గద్దర్ కి నివాళులు అర్పించి గద్దర్ని గుర్తు చేసుకుంటూ పాటలు పాడడం జరిగింది. గద్దర్ ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలను పాటల రూపంలో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీమ్ లీడర్ వడ్లకొండ అనిల్ కుమార్, ఆవునూరి కోమల, మహాదేవుని శ్రీధర్, తుమ్మనపల్లి రాజు, ఎర్ర సురేష్, దొగ్గల శ్రీధర్, రావుల తిరుపతి, రావుల సాయికుమార్, కోoకటి తిరుపతి, ఎండి ఆసియా, సీనియర్ కళాకారులు ఆవునూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

వడ్లకొండ అనిల్ కుమార్ కళాబృందంచే పాటల రూపంలో నివాళులర్పిస్తున్న కళాకారులు..
——————–++++++++++———————
&పత్రికా ప్రకటనలు&
———————–+++++++——————–
#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#







