
– బీసీలకు 42 శాతానికి కట్టుబడి ఉన్నాం.
– బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, దానికి మద్దతుగా అసెంబ్లీలో క్యాబినెట్ లో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపామని కేంద్రంలోని బీజేపీ లోకసభలో బీసీ రిజర్వేషన్ చేయించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు రాష్ట్ర టీపీసీసి ఉపాధ్యక్షులతో పాటు పాల్గొన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతి, గవర్నర్ దగ్గరికి పంపామని వెంటనే ఆమోదం తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలలో హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు ,దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ , 70 మందికి పైగా ఎంపీలు, 50 మందికిపైగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుతో పాటు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులు వేల సంఖ్యలో , అన్ని వర్గాల నాయకులు పాల్గొన్నారు.



ఢిల్లీలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెల ప్రణవ్
———————-+++++++——————–
&పత్రికా ప్రకటనలు&
——————+++++++++——————–
&#వార్షికోత్సవ శుభాకాంక్షలు#&







