
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాచార హక్కు చట్టం హుజురాబాద్ మండల అధ్యక్షునిగా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె గ్రామానికి చెందిన పల్లె సతీష్ గౌడ్ ని నియమిస్తూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ప్రజల కులాలు ప్రవేశించేందుకు మరియు సమాచార హక్కు చట్టం ఆర్టిఐ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందాల ప్రకారం పౌరులకు లభించాల్సిన ప్రయోజనాలను పొందడంలో సహాయపడేందుకు కృషి చేస్తుంది, ముఖ్యంగా శివ శక్తి మరియు అసూ శక్తి రంగాలలో పనిచేస్తున్న ప్రజల గృహ కుటుంబ సమస్యలు పరిష్కరించేందుకు మరియు వారి సంక్షేమానికి నిబద్దతగా పనిచేస్తుందనీ తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకం పట్ల పల్లె సతీష్ గౌడ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిటీ విధానాలను పటిష్టం చేయడంలో, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందించడంలో తన పూర్తి సేవను అంకిత భావంతో సేవ చేసేందుకు తన పదవిని ఉపయోగించుకుంటానని తెలిపారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ కి, రాష్ట్ర అధ్యక్షులు సురా స్రవంతికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ కు సతీష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సమాచార హక్కు చట్టం సాధన కమిటి హుజురాబాద్ మండల అధ్యక్షునిగా నియామకమైన పల్లె సతీష్ గౌడ్

సతీష్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దృశ్యం..

సతీష్ గౌడ్ కందజేసిన ధ్రువీకరణ పత్రము, ఐడి కార్డ్…
——————–+++++———————-
#&పత్రికా ప్రకటనలు&#
———–++++++————————-
&&వార్షికోత్సవ శుభాకాంక్షలు&&






