
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ ఆగస్టు 9: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వగృహంలో సోదరి మణి కావేటి శైలజ ప్రేమపూర్వకంగా రాఖీ కట్టారు. సోదరుడు–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరిగిన ఈ వేడుకలో సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మంత్రి బండి సంజయ్ సోదరికి కానుకలు అందజేశారు. రాఖీతో బంధం మరింత బలపడిందని ఈ సందర్భంగా బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర భద్రత సిబ్బందికి బండి సంజయ్ సతీమణి బండి అపర్ణ రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటారు.


కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాఖీ కట్టి నోరు తీర్చిన సోదరి మణి కావేటి శైలజ



కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర భద్రత సిబ్బందికి రాఖి కడుతున్న బండి సంజయ్ సతీమణి బండి అపర్ణ





