
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ సైదాపూర్ ఆగస్టు 9: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనుకేపల్లి గ్రామంలో రాఖీ పండుగ రోజు యూరియా ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామంలో సుమారు 300 మంది రైతులు ఉండగా, కేవలం సగం లోడు యూరియా మాత్రమే రావడంతో తెల్లవారుజామునే స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) గోదాం వద్ద రైతులు భారీగా చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు గోదాం తెరవకపోవడంతో రైతులు చెప్పులను క్యూలైన్లో అమర్చి నిరీక్షించారు. మండల వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..
తరువాత సొసైటీ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని చెప్పులను తొలగించి రైతులను వరుసలో నిలబెట్టారు. అనంతరం ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ జరిపారు. అయితే తక్కువ పరిమాణంలో సరఫరా కావడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది.

యూరియా బస్తాల కోసం మిగిలిన కార్యాలయం వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టిన రైతులు..

పోలీసులు చేరుకొని చెప్పులను తొలగించి, రైతులను లైన్లో నిలబెట్టిన దృశ్యం..

వెనుకేపల్లి సింగిల్ విండో కార్యాలయం…





