
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: వర్షాలకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యుత్ శాఖ వారు హెచ్చరిక జారీ చేశారు. ఈ నియమాలు తప్పక పాటించండి.
వర్షపు వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాల దగ్గర గుమికూడకండి.
తడి చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్/ఆఫ్ చేయకండి.
ఇళ్లలో తడి నేలపై ఎలక్ట్రిక్ తీగలు, పరికరాలు పడకుండా జాగ్రత్తపడండి.
వర్షాకాలంలో ఇంటి వద్ద ఇనుప రాడ్లు, సిమెంట్ రాడ్లు, టిన్ షీట్లు వంటివి బహిరంగ ప్రదేశాల్లో ఉంచకండి.
ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడివుంటే, వాటిని తాకవద్దు. వెంటనే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వండి.
వర్షంలో తెగి పడిన తీగలు, చెట్లపై పడివున్నా, వాహనాలపై పడివున్నా దగ్గరగా వెళ్లవద్దు.
తెగి పడిన తీగలు, పరికరాలు కనిపిస్తే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వండి.
ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు వాడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.
వర్షపు నీటితో నిండిన ప్రదేశాల్లో, పొలాల్లో, రోడ్లలో ఉన్న ఎలక్ట్రిక్ లైన్ల దగ్గర తిరగవద్దు.
విద్యుత్ తీగలు, స్తంభాల దగ్గర గుడారాలు, షెడ్లు, టెంట్లు వేశాకూడదు.
పిల్లలు ఎలక్ట్రిక్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఆడకూడదు.
వర్షాకాలంలో ఇంటి లోపలికి వచ్చే కరెంట్ షాక్‌లను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
ఇంటిలో ఫ్యూజ్ లైన్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోండి.
తడి బట్టలు, తడి చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్‌లను తాకవద్దు.
వర్షాకాలంలో మోటార్ వాడకం తగ్గించాలి.
విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ 1800 425 0028, 1912 నంబర్‌కి కాల్ చేయండి.


—————–++++++++++———————-
&&పత్రికా ప్రకటనలు&&
——————++++++++———————
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






