
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలానికి చెందిన ఇద్దరు బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. తనుగుల పాక్స్ చైర్మెన్ పోల్సాని వెంకటేశ్వర్ రావు, బిజిగిరిషరీఫ్ మాజీ సర్పంచ్ యుగంధర్ రెడ్డి లకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు, ప్రణవ్ నాయకత్వాన్ని బలపరించేందుకు పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ బాబుతో పాటు మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నేత ప్రణవ్..


కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…..





