
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హైదరాబాదులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరినట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కాగా తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి, శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, పాపక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, శాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య, నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణరెడ్డి, రాచపల్లి సదానందం, జైద శ్రీనివాస్ లు కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేయగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ….
ప్రజలు తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు.






వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పక్కన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లతో కేటీఆర్ కౌశిక్ రెడ్డి తదితర నాయకులు..





