Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇప్పటి వరకు కొనుగోలు చేయని రైతులకు మొదటి ప్రాధాన్యతలో యూరియా బస్తాలను ఇవ్వడం జరుగుతుందనీ హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు జీ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నందున హుజురాబాద్ డివిజన్ లోనీ అన్ని మండలాలకు త్వరలోనే తగినంత యూరియా ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించడం జరుగుతుందన్నారు.
కాబట్టి ఇప్పటికే యూరియా బస్తాలను కొనుగోలు చేసిన రైతులు దయచేసి మళ్ళీ కొనుగోలు చేయడానికి రావద్దు అని కోరుతున్నామన్నారు. ఇప్పటివరకు తీసుకోని రైతులకు మాత్రమే తదుపరి వచ్చు యూరియా బస్తాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని కొరకు ఇప్పటి వరకు ఏ రైతులు యూరియా బస్తాలను కొనుగోలు చేశారు, ఎక్కడ కొనుగోలు చేశారు, ఎన్ని బస్తాలను కొనుగోలు చేశారు అన్న పూర్తి వివరాలను తయారు చేసుకోవడం జరిగిందన్నారు.
కావున రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం వారికి వ్యవసాయ శాఖ వారికి సహకరించాలని కోరుతున్నామన్నారు.






