
– రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో పాల్గొన్న సభా వేదికపై నుంచి ప్రధాని మోదీ మాతృమూర్తిని దూషిస్తూ, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ కుసంస్కారానికి నిదర్శనమని బిజెపి నేతలు అన్నారు. ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ వ్యాఖ్యలను నిరసిస్తూ హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని మోదీ తల్లి గురించి అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలతో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాల స్థాయికి చేరుకుందన్నారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేస్తున్న పనికిమాలిన రాజకీయాలను చూసి దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మోడీ తల్లిపై రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహించిన సభా వేదికగా ప్రధాని మోదీ తల్లిపై దూషణలు తలెత్తినందున ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ తల్లి పేదరికంలో నుంచి వచ్చిన విలువలు నేర్పారని, అందువల్లే మోదీ ప్రధాని స్థాయికి చేరుకున్నారన్నారు. ఒక పేద తల్లి కుమారుడు 11 ఏళ్లుగా ప్రధాని పీఠంపై ఉండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందన్నారు. మోడీ తల్లిని దూషిస్తూ, కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్యకర భాషను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, తాజా మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్, బిజెపి సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, అంకటి వాసు, హజార్, యాళ్ల సంజీవరెడ్డి, బోరగాల సారయ్య, మోతే తిరుపతి, కొలిపాక వెంకటేష్ కొడిమ్యాల పవన్, భాస్కర్ యాదవ్, డోరి ఐలయ్య, బిమోజ్ వెంకట్, క్యాష వెంకటేష్, మోసం వెంకటేశ్వర్లు, తాళ్లపెళ్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు








