
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భవతి అని చూడకుండా గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేయడం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో చోటుచేసుకాగా దాని వివరాల్లోకి వెళితే… టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు అనే వ్యక్తి జానపద కళాకారుడిగా జీవనం సాగిస్తున్న ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న చిన్న విభేదాలతో మొదటి భార్య ఐదేళ్లుగా రాములును పట్టించుకోకుండా దూరంగా ఉంటోంది. దీంతో రాములు హుజురాబాద్ మండలానికి చెందిన తిరుమలను రెండో భార్యగా పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు. రాములు సంబంధించిన ఇల్లును, ఇతర ఆస్తినీ రెండవ భార్య తిరుమల పేరున మార్చగా మొదటి భార్యకు కుమారులు ఇద్దరు ఉండగా వారు శనివారం రాముల దగ్గరికి వచ్చి గొడవకు దిగారు. వీరి మధ్య గతంలో అనేకసార్లు జరగగా నేడు మరోసారి గొడవ జరగడంతో అది కాస్త తీవ్రరూపం దాల్చడంతో మొదటి భార్య కొడుకులు.. రాములు రెండో భార్య తిరుమలను ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు. దీంతో ఈ సంఘటన రాత్రి వరకు గ్రామంలో కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే జమ్మికుంట రూరల్ లక్ష్మీనారాయణ, ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆస్తి కోసమే మొదటి భార్యకు సంబంధించిన వారు ఈ హత్యకు ఓడి గట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తుండగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







