Oplus_16908288
– సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా
– కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించనుంది. అలాగే సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరించడం, 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలి, 10న తుది ఓటర్ల, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నందున, దాని నుంచి పూర్తిస్థాయిలో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకున్నామనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తొలుత నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలపై పైచేయి సాధించి, అత్యధికంగా జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్ష పదవులను గెలుచుకునేందుకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన నిర్ణయం ఉపకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుల రహితంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
@సన్నాహాల్లో పీఆర్ శాఖ, ఎస్ఈసీ@
ఈ నెలాఖరులోగా రెండుదశల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత 2, 3 వారాల వ్యవధిలో అంటే, అక్టోబర్ 20లోగా పంచాయతీ ఎన్నికలు ముగించేలా ప్రణాళికలు సిద్ధంచేసినట్టు చెబుతున్నారు. బ్యాలెట్ల ముద్రణకు పేపర్ ఆర్డర్ చేసి సిద్ధంగా పెట్టుకోవడం, జిల్లా కలెక్టర్లు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ లను గుర్తించడం ఓటు నమోదుకు గుర్తుగా చేతి వేలిపై ఇంక్ గుర్తు వేసేందుకు (ఇ@లైబుల్ ఇంక్) ఇంక్ సంసిద్ధం చే సుకోవడం, ఓటర్ల జాబితాల తుది ప్రకటన వంటి సన్నాహా లు పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈ సీ) చేస్తున్నాయి. ఈనెల 28న ప్రచురితమైన గ్రామపం చాయతీ ముసాయిదా ఓటర్ల జాబితా తమ అధికారిక వెబ్సైట్ (tsec.gov.in)లో ప్రజలు / ఓటర్లకు అందుబాటులో ఉన్నట్టు ఎస్ఈసీ తెలిపింది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ పరంగా మొదట రిజర్వేషన్ల ఫార్ములాను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాకు అనుగుణంగా పీఆర్ఆర్డీ శాఖ బీసీలు, ఇతర వర్గాలకు రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తుంది. ఎన్నికల సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణా తరగతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎప్పుడు జరపాలో ఎస్ఈసీకి ప్రభుత్వం తెలియజేయగా ప్రభుత్వం నుంచి సమాచారం అందినందున ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు షెడ్యూల్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం రాత్రి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పోలింగ్ స్టేషన్ల జాబితాను జిల్లా కలెక్టర్ల ఆమోదంతో ఎంపీడీవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం చేసి ప్రచురించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 10 కల్లా ఈ ప్రచురణ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ సూచించింది.
💥వివిధ దశలు ఇలా…
➡️సెప్టెంబర్ 6: మండల స్థాయిలో ఎంపీడీవోలు ఎంపీటీసీ,జెడ్పీటీసీ పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రచురించాలి.
➡️సెప్టెంబర్ 8: జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికా రులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి.
➡️సెప్టెంబర్ 8: మండల స్థాయిలో ఎంపీడీవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశం నిర్వహించాలి.
➡️సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు: వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు.
➡️సెప్టెంబర్ 9: ఫిర్యాదులు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే పరిష్కారం లేదా తిరస్కారం.
➡️సెప్టెంబర్ 10: జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ స్టేషన్ల తుది జాబితాల ప్రచురణ.

————————+++++++++——————-
&&పత్రికా ప్రకటనలు&&
—————–+++++++++——————–
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






