
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 31: హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ సి 1994- 95 బ్యాచ్ పూర్వ విద్యార్థి బొడిగ తిరుపతిగౌడ్(హోంగార్డు) కుమారుడు బోడిగే సందీప్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు సందీప్ కు ఇద్దరు చిన్న పిల్లలు ఉండడంతో వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులందరు పూనుకున్నారు. తలా కొంత వేసుకొని పూర్వ విద్యార్థులు (మిత్రులు) కొందరు ఆదివారం వారి ఇంటికి వెళ్లి పిల్లల పేరున ఆర్థిక సహాయం(₹10వేలు నగదు) అందజేశారు. చిన్ననాటి మిత్రుని కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకొని వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే మంచి ఆలోచనతో పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి మిత్రుని కుటుంబానికి అండగా నిలవడం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మోరే కుమార్, గోస్కుల చందు, అలిసేరీ శశిభూషణ్, చీకోటి వెంకటరమణ, పిన్ రెడ్డి రాజేందర్ రెడ్డి, పూర్వ విద్యార్థి బొడిగ తిరుపతిగౌడ్ అతని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


మిత్రుడు బోడిగే తిరుపతి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్న పూర్వ విద్యార్థులు హై స్కూల్ 1994-95 బ్యాచ్ మిత్రులు
—————+++++++++—————–
&&పత్రికా ప్రకటనలు&&
————-+++++++——————–
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






