
– కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా, డివిజన్ అధ్యక్షులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల్ చేల్పూర్ గ్రామంలో పంజాల తిరుపతి ఎల్ఐసి ఏజెంట్ వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామి వారికి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు పూజారులు దామెర వెంకటేశ్వరచార్యులు, బస్మాంగ శంకరయ్య నిర్వహించగా, అన్న ప్రసాద వితరణ, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిసి ఆజాద్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగా పండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అ విజ్ఞేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. పూజ అనంతరం గ్రామస్తులతో భక్తిశ్రద్ధలతో భజన ఆట పాటలతో ఎంతో వైభవంగా పాల్గొనడం జరిగింది. పూజ అనంతరం “మహా అన్న ప్రసాద వితరణ” పంజాల తిరుపతి ఎల్ఐసి ఏజెంట్, చంద్ర శివ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్నీ ఏర్పాటు చేయగా, ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ లియాఫీ అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు, ప్రధాన కార్యదర్శి మునిగాల సమ్మారావు, కోశాధికారి గంట సంపత్, ముఖ్యఅతిథిగా బీసీ ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, డాక్టర్ మోడెపు శ్రీకర్ ఎండి, రిపోర్టర్లు నంబి భరణి కుమార్, ముస్కే శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొని ఆ గణనాథుని దర్శించుకుని, అన్నదానం కార్యక్రమంలో పాల్గొని దేవుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండపo కార్యనిర్వాహకులు పంజాల సిద్ధార్థ గౌడ్, గుర్రం కీర్తన్, పంజాల సమ్మయ్య గౌడ్, బుర్ర వెంకటయ్య గౌడ్, పంద్యాల ఓదెలగౌడ్, కర్ణ కంటి విశ్వేశ్వర్ రావు, గుర్రం శ్రీనివాస్ గౌడ్, భజన భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.


అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్న నిర్వాహకులు…

ప్రసాదన్న స్వీకరిస్తున్న మహిళలు…

శ్రీ వినాయకుని దర్శించుకున్న బీసీ ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, డాక్టర్ మోడెపు శ్రీకర్ ఎండి, రిపోర్టర్లు నంబి భరణి కుమార్, ముస్కే శ్రీనివాస్, తిరుపతి తదితరులు..
————–+++++++——————
&&పత్రికా ప్రకటనలు&&
———-+++++++——————
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






