
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఏడు నెలల గర్భిణీ ముద్రబోయిన తిరుమల(35)ని అత్యంత కిరాతకంగా నిన్న సాయంత్రం హత్య చేసిన ఆమె భర్తతో పటు మొదటి భార్య ఆమె ఇద్దరు కుమారులు నలుగురిని 24 గంటలు గడవకుండానే పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం హర్షం వ్యక్తం అవుతుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇల్లందకుంట మండలం టేకుర్తికి చెందిన ముద్రబోయిన రాములు(40) ఒగ్గు కథ చెప్పుకుంటూ జీవిస్తాడు. 20 సంవత్సరాల క్రితము రాములుకు కనగర్తి కి చెందిన రేణుక (38)తో వివాహం జరుగగా వారికీ అభిలాష్ (21), బన్నీ తేజ (19) అను ఇద్దరు కుమారులు ఉన్నారు. రాములు వృత్తిరీత్యా వరంగల్ వెళ్తున్న క్రమంలో అక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి కి చెందిన పెళ్ళై భర్తతో వేరుగా ఉంటున్న ఎస్సి కులానికి చెందిన ముద్రబోయిన తిరుమల(35) తో పరిచయం పెరిగి 7 సంవత్సరాల క్రితం ఆమెను రెండవ వివాహం చేసుకొని టేకుర్తిలో వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో రాములు మొదటి భార్య మరియు కొడుకులు ఆమెపై కక్ష్య పెంచుకొని ఆమెతో తరచు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో తిరుమల గర్భవతి అయి ప్రస్తుతం 7 నెలల గర్భవతిగా ఉంది. మొదటి నుండి తిరుమలకు గర్భం రావడం ఇష్టం లేని రాములు, అప్పటికే తిరుమలపై కక్ష్య పెట్టుకున్న మొదటి భార్య, ఆమె కుమారులు తిరుమలను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకొని రాములు చిన్న కుమారుడైన బన్నీతెజను తిరుమలను చంపడానికి ప్రేరేపించి అదను చూసి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ముందుగానే కొనుక్కున్న కత్తితో బన్నీతెజను పంపించి విచక్షణరహితంగా ఆమె గొంతు కోసి, కత్తితో పొడిచి చంపివేయడం జరిగింది.
ఇట్టి సంఘటనపై కేసు నమోదు చేసుకున్న ఇల్లందకుంట పోలీస్ లు, ఈరోజు హుజురాబాద్ ఇంచార్జి ఏసీపీ శ్రీనివాస్ జీ పారిపోతున్న నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనపర్చుకుని నింధులను కోర్టులో హాజరుపరిచారు.
ఇట్టి కేసులో నేరం జరిగిన తర్వాత అతి తక్కువ సమయంలో చాకచక్యంగా వ్యవహారించి నిందితులను పట్టుకున్న జమ్మికుంట రురల్ సీఐ కె లక్ష్మినారాయణ, ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ ని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ, హుజురాబాద్ రురల్ సీఐలు రామకృష్ణ, పులి వెంకట్, వీణవంక, సైదాపుర్ ఎస్సైలు ఏ .తిరుపతి, సిహెచ్ తిరుపతిలు పాల్గొన్నారు.

గర్భిణి తిరుమలను హత్య చేసిన ఆమె భర్త, మొదటి భార్య, ఆమె ఇద్దరు కుమారులను అరెస్టు చూపుతున్న ఎపి శ్రీనివాస్ జి, రూరల్ సీఐ లక్ష్మీనారాయణ…
—————-+++++++++—————–
@@పత్రికా ప్రకటనలు@@
————–++++++++++——————
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






