
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి సమీపంలోని కేసీ క్యాంపులో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపిస్తున్నారు.
శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని, 8వ తరగతి చదువుతున్న ఎస్. దీక్షితతో పాటు మరో విద్యార్థిని అరికాళ్ళను ఎలుకలు తీవ్రంగా కరిచాయని సమాచారం. గతంలో ఇదే తరహా ఘటనలు సైదాపూర్ బాలుర గురుకుల పాఠశాల, కేశపట్నం కస్తూర్బా పాఠశాలలో జరగగా, తాజాగా హుజూరాబాద్‌లో పునరావృతం కావడంతో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాత్రి దాడి, మధ్యాహ్నం చికిత్స:
ఘటన జరిగిన తర్వాత, ఆరోగ్య సూపర్వైజర్ శనివారం రాత్రి దాడి జరిగిందని, ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స ఇప్పించినట్లు సమాచారం. ఒక విద్యార్థినికి టెటనస్ టాక్సాయిడ్ (TT)తో పాటు వ్యాక్సిన్ ఇచ్చారని, మరో విద్యార్థినికి టీటీ టీకాను హాస్టల్‌కు తీసుకువెళ్లి ఇచ్చినట్లు తెలుస్తోంది.
పరిశుభ్రత లోపం కారణం!:
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోయింది. దీంతో చుట్టూ పెరిగిన గడ్డి, చెత్తాచెదారం ఎలుకలకు ఆవాసంగా మారాయి. అక్కడి నుంచి హాస్టల్ గదుల్లోకి ప్రవేశించిన ఎలుకలు నిద్రిస్తున్న విద్యార్థినులను కరుస్తున్నాయి. పాఠశాల గదుల చుట్టూ ఉన్న గడ్డి, చెత్తాచెదారం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్:
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎలుకల బెడద లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు

ఎలుకలు కరిచిన 8వ తరగతి చదువుతున్న ఎస్. దీక్షిత, పైన కాలును కొరికిన ఎలుకలు..

మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల హుజురాబాద్..

అపరిశుభ్రంగా ఉన్న గురుకుల పాఠశాల ఆవరణ…
———–+++++++——————–
&&పత్రికా ప్రకటనలు&&
—————++++++++—————
@##వార్షికోత్సవ శుభాకాంక్షలు##@






